హైదరాబాద్ లో చల్లబడ్డ వాతావరణం .. పలు చోట్ల చిరు జల్లులు

  • హయత్ నగర్, దిల్ షుక్ నగర్ ప్రాంతాల్లో చిరుజల్లులు
  • మల్కాజ్ గిరి, సైనిక్ పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం
  • సికింద్రాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన
హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. ఈరోజు సాయంత్రం నగరంలోని పలు చోట్ల చిరుజల్లులు పడ్డాయి. హయత్ నగర్, దిల్ షుక్ నగర్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, రామంతాపూర్, అంబర్ పేట, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లిలో చిరుజల్లులు కురవగా; మల్కాజ్ గిరి, సైనిక్ పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కాగా, సికింద్రాబాద్ సహా పరిసర ప్రాంతాలు మౌలాలి, నేరెడ్ మెట్, తార్నాక, ఓయూ, నాచారం, సీతాఫల్ మండి, చిలకలగూడ, కవాడిగూడ, ముషీరాబాద్, గాంధీనగర్ అడ్డగుట్ట, తుకారాం గేట్ లో వడగండ్ల వాన కురిసింది.
Go Back to Shorts
Hyderabad
secunderabad

More Telugu News